Abn logo
Sep 13 2020 @ 11:23AM

ఈ బ్యాగు ధరెంతో తెలుసా?

Kaakateeya

సెలెబ్రిటీలు ఏ లుక్‌లో కనిపించినా... కెమెరాలు క్లిక్కుమంటాయి. వారు వేసుకున్న టీ షర్టు దగ్గర నుంచి షూ దాకా, ప్రతి దాన్ని పట్టి పట్టి చూస్తారు అభిమానులు. మలైకా అరోరా విషయంలో అదే జరిగింది. ఎన్నో రోజుల హోమ్‌ ఐసోలేషన్‌ తరవాత జనాల మధ్యకి వచ్చింది మలైకా. ఒక టీవీ రియాల్టీ షో షూటింగ్‌ పాల్గొనేందుకు తన పెంపుడు కుక్కతో పాటూ స్టూడియో ముందు కారు దిగింది. అక్కడే ఉన్న కెమెరాలు మలైకా లుక్‌ను క్లిక్‌ మనిపించాయి. ఆ ఫోటోలు చూసిన వారందరూ మలైకా కుక్క గురించో, ఆమె డ్రెస్‌ గురించో మాట్లాడుకోవడం లేదు... కేవలం ఆమె వేసుకున్న స్లింగ్‌ బ్యాగు గురించే చర్చంతా. ప్రముఖ సెలెబ్రిటీ బ్యాగుల బ్రాండ్‌ గుషీ  తయారుచేసిన బ్యాగు అది. లేత గులాబీ రంగులో చక్కగా ఉంది. దాని ధరెంతో తెలుసా? అక్షరాలా లక్షా డబ్బై అయిదు వేల రూపాయలు. మహా అయితే అందులో చిన్న వాలెట్‌, ఓ ఫోను తప్ప ఇంకేమీ పట్టవు. అయినా రేటు మాత్రం అదిరిపోయేలా ఉంది. 

Advertisement
Advertisement
Advertisement