Advertisement
Advertisement
Abn logo
Advertisement

యాసంగిలో వరి సాగు వద్దు

పెంచికలపేట, డిసెంబరు 4: యాసంగిలో వరి పంటను రైతులు సాగు చేయొద్దని తహసీల్దార్‌ అనంతరాజు అన్నారు. మండలంలోని ఎల్కపల్లి గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాన్ని శనివారం ఏడీఏ రాజుల నాయుడితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నాణ్యమైన వరి ధాన్యాన్ని తీసుకుని రావాలని సూచించారు. యాసంగిలో ఆరుతడి పంటలే సాగు చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఏపీఎం కొనయ్య, ఎంపీటీసీ రాజన్న, సీసీ సుశీల, ఏఈవో శ్రీవిద్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement