Abn logo
Sep 28 2020 @ 04:39AM

‘ఉద్యోగుల మధ్య వివాదాలు సృష్టించొద్దు’

విజయవాడ(వన్‌టౌన్‌), సెప్టెంబరు 27: ట్రెజరీ ఉద్యోగుల మధ్య కొందరు వివాదాలు సృష్టించాలని ప్రయత్నం చేస్తున్నారని, న్యాయబద్ధంగా ఎన్నికైన కార్యవర్గాన్ని కాదని సొంతగా ప్రకటించుకుంటున్నారని అసోసియేషన్‌ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రవి, రమణారెడ్డి ఆరోపించారు. ఆదివారం విజయవాడలో రాష్ట్ర ట్రెజరీ సర్వీసెస్‌ అసోసియేషన్‌ అత్యవసర సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రవి మాట్లాడుతూ శోభన్‌బాబు అనే వ్యక్తి కారణంగా అసోసియేషన్‌లో పొరపొచ్చాలు వచ్చాయని.. ఈ కారణంగానే అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి పలు తీర్మానాలు చేసినట్టు చెప్పారు. సంఘంలో ఉంటూ సంఘ విద్రోహ చర్యలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటామని అన్నారు

Advertisement
Advertisement
Advertisement