Abn logo
Feb 25 2021 @ 20:18PM

డీఎంకే, కాంగ్రెస్ మధ్య పొత్తు చర్చలు షురూ

చెన్నై : ఎన్నికల సమయం దగ్గరపడుతుండటంతో డీఎంకే, కాంగ్రెస్ అలర్ట్ అయ్యాయి. ఈ పార్టీల మధ్య గురువారం నుంచి పొత్తు చర్చలు ప్రారంభమయ్యాయి. డీఎంకే తరపున ప్రధాన కార్యదర్శి దురైమురుగన్, కనిమొళి, టీఆర్ బాలు పాల్గొన్నారు. ఇక కాంగ్రెస్ నుంచి మాజీ సీఎం ఊమెన్ చాందీ, రణదీప్ సూర్జేవాలా, తమిళనాడు ఇన్‌చార్జి దినేశ్ గుండూ రావ్ పాల్గొన్నారు. ‘‘మా ఇద్దరి ఆలోచనలను పంచుకున్నాం. ఎవరికి వారం, విడివిడిగా చర్చించుకొని, మళ్లీ ఓ సారి కలుద్దామని నిర్ణయించుకున్నాం. అయితే ఈ సమావేశంలో ఎన్ని సీట్లలో ఎవరెవరు పోటీ చేయాలన్నది మాత్రం నిర్ణయించుకోలేదు. కేవలం చర్చలు మాత్రమే జరిపాం.’’ అని తమిళనాడు పీసీసీ అధ్యక్షుడు కే.ఎస్. అళగిరి తెలిపారు. 

Advertisement
Advertisement
Advertisement