Advertisement
Advertisement
Abn logo
Advertisement

జగన్‌రెడ్డి పాలనలో ప్రజలు ఓడిపోయారు: డీఎల్ రవీంద్రారెడ్డి

కడప: వైసీపీ ప్రభుత్వంపై మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి మండిపడ్డారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ జగన్‌రెడ్డి పాలనలో ప్రజలు ఓడిపోయారని, జగన్ పాలనలో కొంతమందికి మాత్రమే న్యాయం జరిగిందన్నారు. ప్రతి పథకానికి వైఎస్సార్ పేరు పెట్టి ఆయన పేరు చెడగొడుతున్నారన్నారు. అభయహస్తం పథకానికి జగన్ తూట్లు పొడిచారని విమర్శించారు. జగన్ పాలనలో విద్యా దీవెన వంటి ఎన్నో పథకాలు నిర్వీర్యమయ్యాయని, జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి ఏం చెప్పినా అధికారులు తల ఊపి సంతకం పెట్టడమేంటని ప్రశ్నించారు. ప్రకృతి వైపరీత్యంతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం తక్షణం ఆదుకోవాలని డీఎల్ రవీంద్రారెడ్డి కోరారు.

Advertisement
Advertisement