Advertisement
Advertisement
Abn logo
Advertisement
Oct 19 2021 @ 16:43PM

దళితబంధు బీజేపీ ఆపిందని నిందలు: డీకే అరుణ

హైదరాబాద్: దళితబంధు నిలుపుదలకు కేసీఆరే కారణమని బీజేపీ నేత డీకే అరుణ అన్నారు. రెండు నెలలలోపు హుజురాబాద్‌లో అందరికీ దళితబంధు ఇస్తానని కేసీఆర్ మాట ఇచ్చారని చెప్పారు. మాట నిలబెట్టుకోలేక దళితబంధు బీజేపీ ఆపిందని తమపై నిందలు వేస్తున్నారని మండిపడ్డారు. సీఎంగా ఉండే అర్హత కేసీఆర్‌కు లేదన్నారు. బీజేపీ దళితబంధు ఆపింది అన్న అసత్య ప్రచారాలు టీఆర్‌ఎస్‌ ఆపాలన్నారు. దళితబంధు ఆపమని బీజేపీ లేఖ రాస్తే ఆ లేఖను బయట పెట్టాలని డిమాండ్ చేశారు. ఎన్నికల కోసం పథకాలు కాదు..రాష్ట్రం కోసం పథకాలు ఉండాలన్నారు. వర్షాలు పడి పంట నష్టపోయి తీవ్ర ఇబ్బందుల్లో రైతులు ఉన్నారని చెప్పారు. పంట నష్టం అంచనా వేయలేదన్నారు. రైతు బంధు ఇచ్చామని చేతులు దులుపుకుంటున్నారు: డీకే అరుణ

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement