Abn logo
Jul 14 2020 @ 22:52PM

జకోవిచ్ నేరమేం చేయలేదు.. టెన్నిస్‌స్టార్‌కు అండగా ప్రపంచ నెంబర్ త్రీ!

సెర్బియా: కరోనా కల్లోలం సమయంలో ఆడ్రియా టూర్ టెన్నిస్ టోర్నమెంట్ నిర్వహించిన ప్రపంచ నెంబర్ వన్, సెర్బియన్ టెన్నిస్ స్టార్ నొవాక్ జకోవిచ్‌పై విమర్శలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా ఈ టోర్నీలో పాల్గొన్న పలువురు టెన్నిస్ స్టార్లకు కరోనా సోకడంతో వారి అభిమానులు కూడా జకోపై నిప్పులుచెరిగారు. ఈ క్రమంలో ప్రపంచ నెంబర్ త్రీ టెన్నిస్ ఆటగాడు డొమినిక్ థీమ్.. జకోకు అండగా నిలిచాడు. ఈ టోర్నీ నిర్వహించడం ద్వారా జకో నేరమేం చేయలేదని డొమినిక్ పేర్కొన్నాడు. ‘జకోను ఇంతలా విమర్శించడం సరికాదు. మనందరం తప్పులు చేస్తాం. ఈ టోర్నీ నిర్వహించడం వెనుక ఎటువంటి దురుద్దేశం లేదుకదా. మంచి ఆలోచనతోనే ఈ టోర్నమెంట్ నిర్వహించారు. అటువంటప్పుడు అదేదో నేరం చేసినట్లు జకోను నిందించడం సరికాదు’ అని డొమినిక్ చెప్పాడు. ఈ టోర్నీలో పాల్గొన్న నలుగురు టెన్నిస్ ఆటగాళ్లకు కరోనా సోకిన విషయం తెలిసిందే.

Advertisement
Advertisement
Advertisement