Advertisement
Advertisement
Abn logo
Advertisement
Nov 28 2021 @ 12:12PM

మందు పార్టీ చేసుకుందామని ఆ దివ్యాంగుడిని ఇంటి నుంచి పిలిచారు.. ఇంతలోనే వారి మధ్య గొడవ.. చివరికి దారుణం!

ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ఒక దివ్యాంగుడు హత్యకు గురైన ఉదంతం వెలుగు చూసింది. ముగ్గురు స్నేహితులు కలిసి ఆ దివ్యాంగుడిని హత్య చేశారు. మద్యం తాగే విషయంలో ముగ్గురి మధ్య వివాదం చోటు చేసుకుంది. ఈ నేపధ్యంలో హర్‌వంశ్‌నగర్‌కు చెందిన ఒక దివ్యాంగుడి మెడపై స్క్రూడ్రైవర్‌తో పొడిచి హత్య చేశారు. వివరాల్లోకి వెళితే నందగ్రామ్‌లో మద్యం తాగే విషయంలో జరిగిన గొడవలో ముగ్గురు స్నేహితులు హర్వంశ్‌నగర్ నివాసి సచిన్ ఉరఫ్ సుదామ(25)ను హత్య చేశారు. ఆ ముగ్గురు స్నేహితులు ముందుగా సుదామ మెడపై స్క్రూడ్రైవర్‌తో దాడి చేశారు. 

తరువాత జాకెట్ తాడుతో మెడను బిగించి హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని దహనం చేశారు.  ఈ ఘటన నవంబరు 22 రాత్రి జరిగింది. అప్పటి నుంచి సుదామ కనిపించకపోవడంతో అతని కుటుంబ సభ్యులు.. ఈ ముగ్గురు స్నేహితులపై అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు ఈ స్నేహితులను విచారించారు. దీంతో వారు నేరం అంగీకరించారు. నిందితులు తెలిపిన వివరాల ఆధారంగా పోలీసులు సంఘటనా స్థలంలో లభ్యమైన ఎముకలను స్వాధీనం చేసుకున్నారు. మృతునికి ఒక కాలు లేనప్పటికీ, మెటల్ ఫ్యాక్టరీలో పనిచేసేవాడు. సిటీ ఎస్పీ నిఫుణ్ మాట్లాడుతూ ఘటనా స్థలంలో మద్యం బాటిళ్లు, గ్లాసులు లభ్యమయ్యాయన్నారు. అలాగే అక్కడే లభ్యమైన మృతుని ఎమకలను డీఎన్ఏ టెస్టుకు పంపించామన్నారు. కేసు దర్యాప్తులో ఉన్నదన్నారు.

Advertisement
Advertisement