Abn logo
Sep 30 2020 @ 05:13AM

తీవ్ర నిర్లక్ష్యం

ఉచిత సరుకుల పంపిణీలో మారని తీరు...

మరోసారి అవకాశమిచ్చిన ప్రభుత్వం


అనంతపురం వ్యవసాయం, సెప్టెంబరు 29: ఎఫ్‌పీ షాపుల్లో ఉచిత సరుకుల పంపిణీపై పలువురు డీలర్లు తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారు. దీంతో ఆశించిన స్థాయిలో సరుకుల పంపిణీ పూర్తి కాలేదు. ఈనెల 28వ తేదీతో 12వ విడత ఉచిత సరుకుల పంపిణీ గడువు ముగిసింది. జిల్లాలో ఇంకా పూర్తి స్థాయిలో కార్డుదారులకు సరుకులు అందకపోవటంతో మంగళవారం వరకు అవకాశమిచ్చారు. అయినా పంపిణీలో మార్పు రాకపోవటంతో మరోసారి బుఽధవారం వరకు పొడిగించారు. జిల్లావ్యాప్తంగా 3012 ఎఫ్‌పీ షాపుల పరిధిలో 12.55 లక్షల రేషన్‌కార్డులున్నాయి. మంగళవారం పదోరోజు 4568 మందికి సరుకులు అందజేశారు. ఇప్పటిదాకా మొత్తంగా 10.70 లక్షల మందికి పంపిణీ చేశారు. ఆఖరు రోజైనా మిగిలిన కార్డుదారులకు సరుకులు ఇస్తారో, లేదో వేచిచూడాల్సిందే.

Advertisement
Advertisement
Advertisement