Abn logo
Aug 7 2020 @ 00:28AM

బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం చెక్కు పంపిణీ

పెద్దకొత్తపల్లి, ఆగస్టు 6 : మండల పరిధిలోని చంద్రకల్‌ గ్రామంలో బాధిత కుటుంబానికి టీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి మంజూరైన ఇన్సురెన్స్‌ చెక్కును బాధితునికి ఎమ్మెల్యే బీరం హర్షవర్దన్‌రెడ్డి గురువారం అందజేశారు. చంద్రకల్‌ గ్రామంలో గత కొన్ని నెలల క్రితం రోడ్డు ప్రమాదంలో వసంతం ఎల్లమ్మ అనే మహిళ మృతి చెందింది. మృతురాలికి టీఆర్‌ఎస్‌ పార్టీ సభ్యత్వం ఉండడంతో పార్టీ నుంచి మంజూరైన 2లక్షల ఇన్సురెన్స్‌ చెక్కును మృతురాలి భర్త నర్సింహ్మకు ఎమ్మెల్యే బీరం హర్షవర్దన్‌రెడ్డి అందజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ నాగయ్య, మాజీ ఎంపీపీ వెంకటేశ్వర్‌రావు, దళిత సమైఖ్య జిల్లా అధ్యక్షుడు కాశన్న, టీఆర్‌ఎస్‌ నాయకులు రమేష్‌రెడ్డి, బండి రవి, స్వామి, నర్సింహ్మ, లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు. 

Advertisement
Advertisement