Abn logo
Oct 13 2020 @ 01:42AM

గ్రామగ్రామాన బతుకమ్మ చీరల పంపిణీ

మేడ్చల్‌ రూరల్‌/ఘట్‌కేసర్‌ రూరల్‌/శామీర్‌పేట రూరల్‌:  మండలంలోని పలు గ్రామాల్లో సోమవారం బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో గ్రామపంచాయతీ కార్యాలయాల వద్ద సర్పంచులు, ఎంపీటీసీలు, వార్డు సభ్యులు మహిళలకు చీరలను పంపిణీ చేశారు. మండలంలోని నూతన్‌కల్‌, లింగాపూర్‌, కొనాయిపల్లి, తదితర గ్రామాల్లో ఎంపీపీ పద్మజగన్‌రెడ్డి , జెడ్పీటీసీ శైలజారెడ్డిలు చీరల పంపిణీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆయా కార్యక్రమాల్లో సర్పంచులు శేఖర్‌, కవితా జీవన్‌, లక్ష్మీ సంజీవ, సొసైటీ చైర్మన్‌ సద్ది సురే్‌షరెడ్డి, మండల కోఆప్షన్‌ సభ్యురాలు రుక్సానా యూని్‌సపాషా, ఎంపీటీసీలు హేమలత, ఆషా సుల్తానా, ఉపసర్పంచ్‌ ప్రభాకర్‌రెడ్డి పాల్గొన్నారు. ఘట్‌కేసర్‌ మండలంలోని ఎదులాబాద్‌లో సర్పంచ్‌ కాలేరు సురేశ్‌ బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. శ్రీనివాస్‌, ఆంజనేయులు, సురేష్‌, రాంచందర్‌, బాల్‌రాజ్‌ పాల్గొన్నారు. ఎంసీపల్లి మండలం అద్రా్‌సపల్లి, లక్ష్మాపూర్‌, కేశవరం, కొల్తూర్‌, జగ్గంగూడ గ్రామాల్లో బతుకమ్మ చీరలను ప్రజాప్రతినిధులు పంపిణీ చేశారు. సర్పంచులు లలితనర్సిం, శిల్పయాదగిరరి, విష్ణువర్దన్‌రెడ్డి, ఎంపీటీసీ నాగరాజు, ఉపసర్పంచ్‌ వైద్యనాధ్‌, జహంగీర్‌, ప్రదీప్‌, బి.శ్రీనివాస్‌, నాగరాజు, నాగలక్ష్మిపాల్గొన్నారు.   

Advertisement
Advertisement