Abn logo
May 28 2020 @ 04:51AM

పాలమూరుపై వివక్ష

2009లో కేసీఆర్‌ను పాలమూరు ఎంపీగా ప్రజలు గెలిపించారు 

ఓడించి ఉంటే రాజకీయ జీవితమే ఉండేది కాదు 

ఇప్పుడు సీఎంగా పాలమూరును ఎడారిగా మారుస్తున్నారు

ఏపీ ప్రభుత్వ కుట్రకు మద్దతిస్తున్నారనే అనుమానం ఉంది 

జూన్‌ 2న రైతుల పక్షాన ప్రాజెక్టుల వద్ద దీక్షలు చేపడతాం 

పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

ప్రాజెక్టులు పూర్తయి ఉంటే పది లక్షల ఎకరాలకు నీరందేది

నికర జలాలున్నా ప్రాజెక్టులకు ఎందుకు పడావు పెట్టింది 

సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క

ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌ కుమార్‌ పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ 

పాల్గొన్న నల్లగొండ, ఉమ్మడి పాలమూరు జిల్లా నాయకులు


మహబూబ్‌నగర్‌, మే 27 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి) : తనకు రాజకీయ జీవితాన్ని ప్రసాదించిన పాలమూరుపై సీఎం కేసీఆర్‌ వివక్ష చూపుతున్నారని పీసీసీ అధ్యక్షుడు కెప్టెన్‌ ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. ’పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంపు-దక్షిణ తెలంగాణ ప్రాజెక్టుల పరిస్థితి’ అనే అంశంపై ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌ కుమార్‌ బుధవారం మహబూబ్‌నగర్‌లో నిర్వహించిన పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. 2009 ఎన్నికల్లో కేసీఆర్‌ పాలమూరు ఎంపీగా పోటీ చేసినప్పుడు ఇక్కడి ప్రజలు మరో ఆరేడు వేల ఓట్లు వేరే అభ్యర్థికి వేసి ఉంటే, కేసీఆర్‌ రాజకీయ జీవితమే ముగిసిపోయేదన్నారు. కానీ, ప్రజలు ఆయన్ను గెలిపించారని గుర్తు చేశారు. ఈ విషయాన్ని మర్చిపోయిన కేసీఆర్‌, ఇప్పుడు ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాను ఎడారిగా మార్చే ఏపీ ప్రభుత్వ కుట్రకు మద్దతిస్తున్నట్లు భావిస్తున్నామని ఆరోపించారు.


దక్షిణ తెలంగాణను ఎడారిగా మార్చే పోతిరెడ్డిపాడు పనులను కేసీఆర్‌ అడ్డుకోవాలని సూచించారు. టీఆర్‌ఎస్‌ నాయకులకు ప్రజలు ఎక్కడికక్కడ నిలదీయాలని, ఆరేళ్లు పూర్తయినా భీమా, నెట్టెంపాడు, కల్వకుర్తి, కోయిల్‌సాగర్‌, ఆర్డీఎస్‌ పథకాలను ఎందుకు పూర్తి చేయలేదో ప్రశ్నించాలని పిలుపునిచ్చారు. పోతిరెడ్డిపాడుపై రైతుల పక్షాన కాంగ్రెస్‌ పోరాడుతుందని, ఇందులో భాగంగా జూన్‌ 2న కృష్ణాబేసిన్‌లో చేపట్టిన పెండింగ్‌ ప్రాజెక్టుల వద్ద ఆధ్వర్యంలో నిరసన దీక్షలు చేపడతామని ఆయన అన్నారు.


సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క మాట్లాడు తూ జలయజ్ఞంలో పాలమూరులో కాంగ్రెస్‌ చేపట్టిన ప్రాజెక్టులు పూర్తి చేసినట్లయితే పది లక్షల ఎకరాల కు సాగునీరందేది. ఏపీ ప్రభుత్వం మిగులు జలాల ను తరలించేందుకు అదనపు పనులు చేపడుతుంటే, తెలంగాణ ప్రభుత్వం నికర జలాలున్న ప్రాజెక్టుల ను ఎందుకు పడావు పెట్టిందని ఆయన నిలదీశారు.


భువనగిరి ఎంపీ  కోమటిరెడ్డి వెంకటరెడ్డి మా ట్లాడుతూ పాలమూరు మంత్రులు శ్రీనివాస్‌గౌడ్‌, ని రంజన్‌రెడ్డి కాంగ్రెస్‌ను విమర్శించడం మానుకోవాల న్నారు. సంగమేశ్వర టన్నెల్‌ ద్వారా శ్రీశైలం నుంచి 801 అడుగుల వద్ద నీరు తీసుకెళ్లే నిర్మాణం జరిగితే పాలమూరు, కల్వకుర్తి, ఎస్‌ఎల్‌బీసీ, డిండి, నాగార్జు నసాగర్‌, ఏఎంఆర్‌ ప్రాజెక్టులకు నీరు అందదని ఆం దోళన వ్యక్తం చేశారు. 


మాజీ మంత్రి నాగం జనార్దన్‌రెడ్డి మాట్లాడు తూ పోతిరెడ్డిపాడుపై ప్రభుత్వం చర్యలకు కాంగ్రెస్‌ పార్టీ డెడ్‌లైన్‌ విధించాలన్నారు. ఆలోగా ప్రభుత్వం స్పందించి జీవోని నిలుపుదల చేయించాలని, లేకపో తే తాను ఆమరణ దీక్షకు దిగుతానని, ఇందుకు  కాంగ్రెస్‌ అధిష్ఠానం అనుమతించాలని కోరారు. 


మాజీ మంత్రి జిల్లేళ్ల చిన్నారెడ్డి మాట్లాడుతూ పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంపు, సంగమేశ్వర టన్నె ల్‌ పనులు జరగకుండా నిరోధించాలని, ఈ విష యంలో సుప్రీం కోర్టు వెళ్లేందుకు సిద్ధమని అన్నారు.


ఏఐసీసీ కార్యదర్శి ఎస్‌ఏ సంపత్‌కుమార్‌ మా ట్లాడుతూ కమీషన్ల కోసమే పాలమూరు ఎత్తిపోతల పథకం డిజైన్లను తెలంగాణ ప్రభుత్వం మార్చిందని అన్నారు. పోతిరెడ్డిపాడు అంశంపై బుధవారం ఆయ న పవర్‌పాయింట్‌ ప్రజంటేషన్‌ ఇచ్చారు. పాలమూ రు పథకాన్ని తొలుత ప్రతిపాదించిన రీతిలో జూరా ల బ్యాక్‌వాటర్‌ నుంచి చేపడితే, ఇవ్వాళ ఈ పరిస్థితి తలెత్తేదికాదని అన్నారు. ఆర్డీఎస్‌ ఆయకట్టుకు నీరి స్తామనే భ్రమకల్పిస్తూ తుమ్మిళ్ల చేపట్టారని, ఈ ప థకం కింద కాల్వల్లో నీరులేదని, జమ్ము, గడ్డి మొలి చిందని ఆరోపించారు. 


ఏఐసీసీ కార్యదర్శి చల్లా వంశీచంద్‌రెడ్డి మా ట్లాడుతూ పోతిరెడ్డిపాడును ఆపలేని పాలమూరు ప్రజాప్రతినిధులు పదవులకు రాజీనామాలు చేయా లని డిమాండ్‌ చేశారు. 


మాజీ ఎంపీ మల్లు రవి మాట్లాడుతూ సీఎం భస్మాసుర స్వభావంతో వ్యవహరిస్తున్నారని, ఇరిగేష న్‌ ప్రాజెక్టుల విషయంలో తప్పుడు నిర్ణయాలతో వె నక్కి రాలేనంత దూరం వెళ్లారని, ఈ అంశాలతో కే సీఆర్‌ తనగొయ్యి తానే తవ్వుకుంటున్నారని అన్నారు. 


డీసీసీ అధ్యక్షుడు ఒబేదుల్లా కొత్వాల్‌ మా ట్లాడుతూ పోతిరెడ్డిపాడు ద్వారా ఉమ్మడి మహబూ బ్‌నగర్‌ జిల్లాకు జరిగే అన్యాయాన్ని ప్రజలకు వివరి స్తామని చెప్పారు. కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా డీ సీసీ అధ్యక్షులు శివకుమార్‌రెడ్డి, వంశీకృష్ణ, రవిశంక ర్‌ప్రసాద్‌, ప్రభాకర్‌రెడ్డి, పీసీసీ కార్యదర్శులు సయ్య ద్‌ ఇబ్రహీం, ఎన్‌పీ వెంకటేశ్‌, జి.మధుసూదన్‌ రెడ్డి, అనిరుధ్‌రెడ్డి, శ్రీహరి, బెక్కరి అనిత, సీజే బెనహర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement