Advertisement
Advertisement
Abn logo
Advertisement

త్వరగా వెళ్లాలనే తొందరలో ఆహారం సరిగ్గా నమలకుండా తింటున్నారా? అయితే..

ఆంధ్రజ్యోతి(18-11-2021)

ఛాతీలో మంట, పొట్ట ఉబ్బరం, ఎసిడిటీ వంటి జీర్ణసమస్యలు చాలాసార్లు ఇబ్బంది పెడుతుంటాయి. వీటిని దూరం చేసుకోవాలంటే ఇదిగో ఈ జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు నిపుణులు. 


గ్యాస్ట్రిక్‌ సమస్యలకు యాపిల్‌ సిడార్‌ వెనిగర్‌ చక్కగా పనిచేస్తుంది. ఒక గ్లాసు నీటిలో ఒక టేబుల్‌స్పూన్‌ యాపిల్‌ సిడార్‌ వెనిగర్‌ వేసుకుని తీసుకుంటే ఎసిడిటీ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. 


కాఫీ, టీలు బాగా తగ్గించాలి. కార్బోనేటెడ్‌ బేవరేజెస్‌ తీసుకోకూడదు. ఇవి యాసిడ్‌ రిఫ్లక్స్‌ సమస్యను రెట్టింపు చేస్తాయి.


ఆహారం బాగా నమిలి తినాలి. త్వరగా వెళ్లాలనే తొందరలో సరిగ్గా నమలకుండా తినకూడదు. 


భోజనం తరువాత రెండు, మూడు లవంగాలు నోట్లో వేసుకుని నమిలితే జీర్ణక్రియ సాఫీగా జరుగుతుంది. జీర్ణక్రియకు అవసరమైన ఎంజైముల తయారీలోనూ లవంగాలు సహాయపడతాయి.


భోజనానికి పుదీనా టీ తాగితే యాసిడ్‌ రిఫ్లక్స్‌ సమస్య వేధించకుండా ఉంటుంది.


రాత్రి పడుకొనే ముందు అలొవెరా టీ తాగితే జీర్ణసమస్యలు రాకుండా ఉంటాయి.

Advertisement

Health Latest newsమరిన్ని...

Advertisement

ప్రత్యేకం మరిన్ని...