Aug 1 2021 @ 12:29PM

ఆస‌క్తిక‌ర‌మైన బ్యాక్‌డ్రాప్‌తో చిరు- బాబి సినిమా

ప్రస్తుతం ‘ఆచార్య’ సినిమాను పూర్తి చేసే పనిలో ఉన్న చిరంజీవి తదుపరి మలయాళ చిత్రం ‘లూసిఫర్’ రీమేక్‌ను స్టార్ట్ చేయబోతున్నారు. చిరంజీవి లైనప్ చేసిన సినిమాల్లో డైరెక్ట‌ర్ బాబీ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యాన‌ర్‌పై ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. లేటెస్ట్ ఇండ‌స్ట్రీ వ‌ర్గాల స‌మాచారం మేర‌కు బాబి.. ఈ సినిమా కోసం ఆస‌క్తిక‌ర‌మైన బ్యాక్‌డ్రాప్‌ను సెల‌క్ట్ చేసుకుని క‌థ త‌యారు చేసుకున్నాడ‌ట‌. ఓ స్టార్ హీరోకి, అత‌ని అభిమానికి మ‌ధ్య న‌డిచే కాన్సెప్ట్‌తో సినిమా ఉంటుంద‌ని టాక్‌.ఇందులో స్టార్ హీరోగా చిరంజీవి న‌టిస్తుంటే.. ఆయ‌న అభిమానిగా ఎవ‌రు న‌టిస్తార‌నేది ఇంకా ఖరారు కాలేద‌ట‌.  బాలీవుడ్‌లో ఫ్యాన్ త‌ర‌మా చిత్ర‌మా, లేక మ‌ల‌యాళంలో డ్రైవింగ్ లైసెన్స్ త‌ర‌హా చిత్ర‌మా అనేది తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.