అమరావతి: ఎంత అన్యాయంగా మాట్లాడుతున్నారంటే... ఎంత దారుణంగా మా గొంతు నొక్కేస్తున్నారంటే.. ఇవన్నీ ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో స్పీకర్ కోడెల శివప్రసాదరావుపై చేసిన విమర్శలు. ‘దిసీజ్ నాట్ ద వే’ అంటూ పదే పదే ఇంగ్లీష్‌లో హెచ్చరించే కోడెల.. ఏనాడూ పరుష పదజాలం విపక్ష సభ్యులపైగానీ, ప్రతిపక్ష నాయకుడిపైగానీ ప్రయోగించలేదు.
కానీ ప్రస్తుత స్పీకర్ తమ్మినేని సీతారాం మాత్రం ఉడత ఊపులంటూ ప్రతిపక్ష సభ్యులను కించపరిచేలా మాట్లాడడం, పేపర్లు విసిరిగొట్టి బెదిరింపు ధోరణిలో మాట్లాడడం వంటివి చేస్తున్నారు. ఇప్పటి మంత్రులు.. అప్పటి ప్రతిపక్ష సభ్యులు అప్పుడెలా ప్రవర్తించారో.. అప్పటి స్పీకర్ కోడెల ఎలా వ్యవహించారో... ఇప్పుడు టీడీపీ సభ్యులు ఎలా ప్రవర్తించారో... స్పీకర్ తమ్మినేని ఎలా రియాక్ట్ అయ్యారో ఈ వీడియో చూడండి... మీకే తెలుస్తుంది..