Abn logo
Aug 7 2020 @ 03:11AM

‘అయోధ్య’ లైవ్‌ ఇవ్వలేదేం?

  • ఎస్వీబీసీ చానల్‌పై బీజేపీ, హిందూ సంఘాల ఆగ్రహం

తిరుపతి, అమరావతి, ఆగస్టు 6(ఆంధ్రజ్యోతి): అయోధ్యలో   రామాలయ భూమిపూజను టీటీడీకి చెందిన ఎస్వీబీసీ (శ్రీవేంకటేశ్వర భక్తి ఛానల్‌) ప్రత్యక్ష ప్రసారం చేయకపోవడంపై బీజేపీ నేతలు, హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ప్రధాని మోదీ పాల్గొన్న ఈ కార్యక్రమాన్ని ప్రపంచవ్యాప్తంగా 250 చానళ్లు ప్రత్యక్ష ప్రసారం చేశాయని, అలాంటిది ఎస్వీబీసీలో ప్రసారం చేయకపోవడమేంటని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు.  ఎస్వీబీసీలో రామమందిర భూమిపూజను లైవ్‌ ఇవ్వకపోవడం దారుణమని తిరుపతిలో బీజేపీ రాష్ట్ర అఽధికార ప్రతినిధి సామంచి శ్రీనివాస్‌ ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘విశాఖ శారదా పీఠానికి సీఎం జగన్‌ వెళ్తే ప్రత్యక్ష ప్రసారాలు చేసిన ఎస్వీబీసీ.. అయోధ్యలో ప్రధాని భూమిపూజ చేస్తే ఎందుకు ప్రసారం చేయదు?


ఎండీ, సీఈవోపై చర్య తీసుకోవాలి’ అని  బీజేపీ రాష్ట్ర నేతలు విష్ణువర్ధన్‌ రెడ్డి, జయప్రకాశ్‌ నారాయణ  డిమాండ్‌ చేశారు. కోరారు. కాగా, అయోధ్య భూమి పూజను ప్రత్యక్ష ప్రసారం చేయని ఎస్వీబీసీ చానల్‌పై చర్యలు తీసుకోవాలని టీడీపీ ఎమ్మెల్సీ బత్యాల చెంగల్రాయుడు డిమాండ్‌ చేశారు. కాగా, శ్రీవారి ఆలయంలో ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి ఒంటిగంట వరకు  నిత్య కల్యాణం లైవ్‌ ఇస్తున్నందున, అయోధ్య భూమి పూజను ఎస్వీబీసీలో ప్రత్యక్ష ప్రసారం చేయలేకపోయామని టీటీడీ  ఒక ప్రకటనలో వివరణ ఇచ్చింది.  

Advertisement
Advertisement
Advertisement