Abn logo
Sep 30 2020 @ 05:07AM

సాయుధ పోరాటంలో ధ్రువతార చంద్రమ్మ

 పలాస రూరల్‌: శ్రీకాకుళ సాయుధ గిరిజన రైతాంగ పోరాటంలో సీపీఐఎంఎల్‌ న్యూడెమోక్రసీ నాయకురాలు చంద్రమ్మ ధ్రువతారగా  నిలి చారని, ఆమె పోరాటపటిమ మరువలేనిదని వక్తలు కొనియాడారు. మంగ ళవారం  లొత్తూరులో  పైల చంద్రమ్మ సంతాపసభ నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐఎంఎల్‌ న్యూడెమోక్రసీ జిల్లా నాయకుడు వంకల మా ధవరావు మాట్లాడుతూ.. చంద్రమ్మ జీవితమంతా పోరాటాలతోనే సాగిం దని తెలిపారు. తొలుతపైల చంద్రమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం లొత్తూరులో ర్యాలీచేశారు. బంగల కుమా ర్‌ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఎంపీటీసీ మాజీ సభ్యుడు సవర గురంగో, కూర్మారావు పాల్గొన్నారు. 

Advertisement
Advertisement
Advertisement