నెహ్రూచౌక్‌లో ధర్నా చేస్తున్న వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు
అనకాపల్లి టౌన్, ఫిబ్రవరి 25: స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేయొద్దని డిమాండ్ చేస్తూ గురువారం వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు ధర్నా చేశారు. సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రాజాన దొరబాబు ఆధ్వర్యంలో కార్మికులు, కర్షకులు ఈ కార్యక్రమం చేపట్టారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేయడం దుర్మార్గపు చర్యగా వారు అభివర్ణించారు. స్టీల్‌ప్లాంట్ పరిరక్షణ కోసం ఐక్యంగా పోరాడదామని ఈ సందర్భంగా రాజాన దొరబాబు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సంఘం ప్రతినిధులు కర్రి బెనర్జీ, బొట్టా చిన్నియాదవ్, వియ్యపు రాజు, కొల్లి సత్యారావు, ఎన్.సత్యనారాయణ పాల్గొన్నారు.