Advertisement
Advertisement
Abn logo
Advertisement

బీసీ జనార్దన్‌రెడ్డిని కలిసిన ధర్మవరం సుబ్బారెడ్డి

బేతంచెర్ల, డిసెంబరు 2: బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నాయకుడు బీసీ జనార్దన్‌ రెడ్డిని టీడీపీ డోన్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి ధర్మవరం సుబ్బారెడ్డి, పార్టీ నాయకులు గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. బనగానపల్లెలోని బీసీ జనార్దన్‌ రెడ్డి స్వగృహంలో ధర్మవరం సుబ్బారెడ్డి ఆయనకు పూలమాలలు వేసి సన్మానించారు. ఈ సందర్బంగా వారు పలు విషయాలపై చర్చలు జరిపారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వలసల రామకృష్ణ, డోన్‌ మార్కెట్‌యార్డు మాజీ చైర్మన్‌ మురళీకృష్ణగౌడు, నంద్యాల లోక్‌సభ నియోజకవర్గ అధికార ప్రతినిధి విజయభట్టు, బేతంచెర్ల మండలం నాయకులు ఎల్లనాగయ్య, తిరుమల చౌదరి, అంబాపురం గ్రామ సర్పంచ్‌ శ్రీనివాస యాదవ్‌, కార్యకర్తలు ఉన్నారు.


Advertisement
Advertisement