Abn logo
Oct 11 2020 @ 05:42AM

రికార్డుల్లోని ఆస్తుల రక్షణకే ధరణి పోర్టల్‌

ఘట్‌కేసర్‌ రూరల్‌/కీసర: పంచాయతీ రికార్డుల్లో ఉన్న ఆస్తుల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసి రక్షణ కల్పించడమే ధరణీ పోర్టల్‌ ముఖ్య ఉద్దేశమని పంచాయతీరాజ్‌ అదనపు కమిషనర్‌, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ధరణీ పోర్టల్‌ పర్యవేక్షకుడు జాన్‌వెస్లీ అన్నారు. శనివారం ఆయన మండలంలోని అవుశాపూర్‌, కాచవానిసింగారం గ్రామాల్లో పర్యటించి ఇంటింటి సర్వేలో పాల్గొన్నారు. ధరణీ పోర్టల్‌లో నమోదు చేస్తున్న ఆస్తుల వివరాల గురించి పంచాయతీ అధికారులను అడిగి తెలుసుకున్నారు.


కార్యక్రమంలో ఎంపీపీ సుదర్శన్‌రెడ్డి, ఉపసర్పంచ్‌ అయిలయ్యయాదవ్‌, వార్డుసభ్యులు మల్లేష్‌, కుశలవరెడ్డి, ఇన్‌చార్జి ఎంపీడీవో పద్మ, కార్యదర్శి ఉమాదేవి, నాయకులు మశ్చేందర్‌రెడ్డి  పాల్గొన్నారు. కీసర మండలంలోని గోధుమకుంట, చీర్యాల్‌ గ్రామంలో  శనివారం రాత్రి డీపీవో పద్మాజారాణి, పంచాయతీ శాఖ డిప్యూటీ కమిషనర్‌ జాన్‌వెస్లీ పర్యటించి ఆస్తుల వివరాల ఆన్‌లెన్‌లో నమోదు ప్రక్రియను పరిశీలించారు. ఇప్పటి వరకు నమోదైన ఆస్తుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.

Advertisement
Advertisement