Abn logo
Dec 1 2020 @ 23:48PM

ధాన్యం కొనుగోలుపై జాప్యం ఎందుకు?

సోన్‌ మండల సమావేశంలో సభ్యుల ఆగ్రహం

సోన్‌, డిసెంబరు 1: రైతులు కష్టపడి పడించిన వరి ధాన్యం కొనుగోలు చేయడంలో తీవ్ర జాప్యం చేయడం ఎందుకు? అని సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం మండల సర్వసభ్య సమావేశంలో ఎంపీపీ బర్ల మానస అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా సమావేశంలో ఏవో ప్రవీణ్‌ కుమార్‌ మాట్లాడుతుండ గా ఉపాధ్యక్షులు కొత్తగొల్ల నరేష్‌, మాదాపూర్‌, కూచన్‌పెల్లి సర్పంచ్‌లు రాజనర్సింహరెడ్డి, ఇందూర్‌ రాజులు కల్పించుకొని రైతులు పండించిన వడ్లు గత నెల రోజులుగా కొనుగోలు చేయకపోవడంతో రోడ్ల పైనే ఉంచవలసిన పరిస్థితులు ఉన్నాయన్నారు. ప్రభుత ్వం చెప్పిన మాట ప్రకారం సన్నరకం వడ్లు పండించినా మద్దతుధర లేక దళారులను ఆశ్రయించి తక్కువ ధరలకు కొనుగోలు చేయడం జరుగుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం సిద్దులకుంట, కూచన్‌పెల్లి సర్పంచ్‌లు మహేందర్‌ రెడ్డి, రాజు, న్యూవెల్మల్‌ సర్పంచ్‌, ఎంపీటీసీలు అంకం గంగమణి నాగయ్యలు మాట్లాడుతూ తమ గ్రామాల్లో మిషన్‌ భగీరథఽ మంచినీళ్లు సరిగ్గా రాక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుందని సభా దృష్టికి తెచ్చారు. మిషన్‌ భగీరథ ఏఈ అనూష మాట్లాడుతూ గ్రామాలకు భగీరథ నీళ్లు సక్రమంగా సరఫరా చేయడం జరుగుతోందని, కొన్నిగ్రామాల్లో ఇబ్బందులు ఉంటే సరిచేస్తామన్నారు. ఐకేపీ ఏపీఎం సులోచన మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తు న్న పొదుపు రుణాలను సద్వినియోగపర్చుకునేలా అవగాహన పెంపొందించాలన్నారు. తహసీల్దార్‌ లక్ష్మీ మాట్లాడుతూ మండలంలో మొత్తం 8621 రేషన్‌ కార్డు లు ఉన్నాయని, వీరికి ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా బియ్యం సరఫరా చేయడం జరుగుతుంద న్నారు. ఈజీఎస్‌ ఏపీఎం మంజుల మాట్లాడుతూ గ్రామాల్లో వచ్చే వేసవిలో ఉపాధి పనులు చేట్టడానికి రూ.28 కోట్ల బడ్జెట్‌ ప్రణాళికలు సిద్ధం చే శామన్నారు. రైతులు గ్రామాల్లో ప్రభుత్వం మంజూరు చేస్తున్న కల్లాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. అనంతరం రంగారెడ్డి జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న సర్పంచ్‌ మృతికి రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఇందులో పీఏసీఎస్‌ చైర్మన్‌ కృష్ణ ప్రసాద్‌ రెడ్డి, ఎంపీడీవో ఉషారాణి, తహసీల్దార్‌ లక్ష్మీ, తదితరులు పాల్గొన్నారు. 

Advertisement
Advertisement