Advertisement
Advertisement
Abn logo
Advertisement

జిల్లా వ్యాప్తంగా ధన్వంతరి హోమాలు

ధన్వంతరి హోమంలో పాల్గొన్న డిప్యూటీ కమిషనర్‌ శ్రీనివాసరెడ్డి. పక్కన అసిస్టెంట్‌ కమిషనర్‌ శాంతి

విశాఖపట్నం, డిసెంబరు 2 (ఆంధ్రజ్యోతి): ప్రజల ఆరోగ్యం బాగుండాలని, ఆయుష్షు పెరగాలని ఆకాంక్షిస్తూ దేవదాయ శాఖ అధికారులు జిల్లా వ్యాప్తంగా గురువారం ధన్వంతరి హోమాలు నిర్వహించారు. ఆ శాఖ కమిషనర్‌ ఆదేశాల మేరకు ధన్వంతరి జయంతి సందర్భంగా వీటిని చేపట్టారు. సూర్యాబాగ్‌లోని విశ్వేశ్వరస్వామి ఆలయంలో బాదంపూడి రమేశ్‌ అప్పాజీ నేతృత్వంలో జరిగిన హోమానికి డిప్యూటీ కమిషనర్‌ వి.శ్రీనివాసరెడ్డి, అసిస్టెంట్‌ కమిషనర్‌ శాంతి హాజరయ్యారు. 

Advertisement
Advertisement