Abn logo
Jul 11 2020 @ 22:06PM

దక్షిణాది రాష్ట్రాల డీజీపీల కీలక సమావేశం

అమరావతి: దక్షిణాది రాష్ట్రాల డీజీపీలు కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్, తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి, కేరళ డీజీపీ లోక్‌నాధ్ బెహరా, తమిళనాడు డీజీపీ జేకే త్రిపాఠి, కర్ణాటక డీజీపీ ప్రవీణ్ సుదీప్, ఇతర అధికారులు పాల్గొన్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. రాష్ట్రాల భద్రత, పరస్పర సహకారాలపై ప్రధానంగా చర్చించారు. దక్షిణాది రాష్ట్రాలతోపాటు పుదుచ్చేరి, లక్షద్వీప్ మధ్య పరస్పర సహాయ సహకరాలు, నేర నియంత్రణపై చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. రాష్ట్రాల మధ్య సమన్వయం సాధించడం, తమిళనాడు నుంచి తప్పించుకుని తిరుగుతున్న టెర్రిరిస్ట్‌లను పట్టుకోవాలని సమావేశంలో చర్చించారు. కేరళ, కర్ణాటక, తమిళనాడు సరిహద్దు రాష్ట్రాల్లో విస్తరిస్తున్న మావోయిస్టు కార్యకలాపాలను కట్టడి చేయాలని నిర్ణయం తీసుకున్నారు. తీర ప్రాంతంలో గస్తీని మరింత పటిష్టం చేసి కట్టుదిట్టంగా వ్యవహరించాలని నిర్ణయించారు. స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంబ్ బ్యూరో ఏపీలో ఏర్పడిన తర్వాత 150 కేసులు నమోదు చేసి 20 వేల కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్టు ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ ఈ సమావేశంలో వెల్లడించారు. 

Advertisement

ఆంధ్రప్రదేశ్ మరిన్ని...

Advertisement
Advertisement