Advertisement
Advertisement
Abn logo
Advertisement

పీర్లకొండకు పోటెత్తిన భక్తులు

ఇచ్ఛాపురం, డిసెంబరు 2: మతసామరస్యానికి ప్రతీకగా నిలిచే పీర్లకొండ యాత్రకు భక్తులు పోటెత్తారు. ఇచ్ఛాపురంలో ఒడిశా సంప్రదాయం ప్రకారం ఏటా మార్గశిర గురువారాల్లో పీర్లకొండ యాత్ర నిర్వహిస్తారు. ఈ క్రమంలో గురువారం యాత్ర ప్రారంభమైంది. జిల్లాకు చెందినవారితో పాటు ఒడిశా నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. కొండపైన గల రెండు మందిరాల్లో పూజలు నిర్వహించారు.  పీర్లస్వామికి  ప్రీతికరమైన  అటుకులు, బెల్లాన్ని నైవేద్యంగా సమర్పించారు. కొండపైగల కందకంలోని నీటిని భక్తులు పవిత్ర తీర్ధంగా స్వీకరించారు. స్వామి ప్రసాదంగా విభూదిని అందుకుని ప్రదక్షిణ చేశారు. రైల్వేస్టేషన్‌ మీదుగా భక్తులు కొండకు రాకపోకలు సాగించడంతో ఈ ప్రాంతమంతా కిటకిటలాడింది. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సీఐ డీవీవీ సతీష్‌కుమార్‌, పట్టణ, రూరల్‌ ఎస్‌ఐలు సత్యనారాయణ, హైమావతి ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు.

Advertisement
Advertisement