Abn logo
Oct 24 2020 @ 14:18PM

ఒక్కో హద్దురాయి రూ.4 వేల ఐదువందలా?: దేవినేని ఉమ

అమరావతి: ఉచితంగానే భూముల రీ సర్వే చేస్తామన్న ప్రభుత్వం నేడు రైతుల నుండి వసూలు చేసేందుకు ప్రయత్నం చేస్తోందని మాజీ మంత్రి దేవినేని ఉమ మండిపడ్డారు. ‘‘ఒక్కో హద్దురాయి రూ.4 వేల ఐదువందలా?. హద్దురాళ్లపై మీ బొమ్మలు చెక్కడానికి రూ.27 వేల కోట్లా?’’ అని ప్రశ్నించారు. వేలకోట్ల ప్రజాధనంతో రంగులు వేయడానికి, మీ బొమ్మలు వేసుకోవడానికేనా..జగన్‌రెడ్డి ఒక్కఛాన్స్ అడిగిందన్నారు.