Advertisement
Advertisement
Abn logo
Advertisement

పశువుల కన్నా హీనంగా బూతుల మంత్రి వ్యాఖ్యలు: దేవినేని ఉమ

అమరావతి: వైసీపీ నేతలపై టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమమహేశ్వరరావు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. జగన్‌రెడ్డి కనుసన్నల్లోనే వైసీపీ నేతలు మాట్లాడుతున్నారని ఆరోపించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బాబాయ్‌ని గెలిపించుకున్నారా? అంటూ ప్రశ్నించారు. పశువుల కన్నా హీనంగా బూతుల మంత్రి కొడాలి నాని మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రైతులు, ప్రజలు ఇబ్బందులు పడుతుంటే.. బూతుల మంత్రితో చంద్రబాబుపై మాట్లాడిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాజెక్టులను కాపాడుకోవాల్సిన బాధ్యత ఇరిగేషన్ డిపార్ట్‌మెంట్‌పై లేదా? అని ప్రశ్నించారు. ప్రజలు ఇబ్బందులు పడుతుంటే.. జగన్‌రెడ్డికి పెళ్లిళ్లకు వెళ్లడం అవసరమా? అని నిలదీశారు. ప్రభుత్వ వైఫల్యాలను నిలదీస్తే బూతులు మాట్లాడతారా? అంటూ దుయ్యబట్టారు. కుటుంబసభ్యులను రాజకీయాల్లోకి లాగడం సరికాదన్నారు. ఇకనైనా కనీసం మనుషుల్లా ప్రవర్తించాలని దేవినేని ఉమ అన్నారు.

Advertisement
Advertisement