Advertisement
Advertisement
Abn logo
Advertisement

దేవినేని శ్రీమన్నారాయణ మృతికి సంతాపం

జి.కొండూరు/కంచికచర్ల, డిసెంబరు 2 : మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తండ్రి శ్రీమన్నారాయణ మృతికి పలువురు నాయకులు గురువారం రాత్రి సంతాపం తెలియజేశారు. మరణవార్త విన్న దేవినేని అవినాష్‌.. విజయవాడలోని రమేశ్‌ ఆసుపత్రికి వెళ్లి నివాళులర్పించడంతో పాటు మృతదేహాన్ని తీసుకెళ్తున్న అంబులెన్సులో దేవినేని ఉమాతో కలిసి కంచికచర్ల వెళ్లారు. దేవినేని నెహ్రూ సతీమణి లక్ష్మి, బాజీ సతీమణి, టీడీపీ కార్పొరేటర్‌ దేవినేని అపర్ణ, దేవినేని చందు, వినయ్‌, టీడీపీ నేతలు బొమ్మసాని సుబ్బారావు తదితరులు ఆసుపత్రి వద్ద నివాళులర్పించారు.

క్రీయాశీలక రాజకీయాల్లో లేకపోయినప్పటికీ...

దేవినేని శ్రీమన్నారాయణ (88) అలియాస్‌ చిన్నిది కంకిపాడు మండలం నెప్పల్లి స్వగ్రామం. కంచికచర్లలో స్థిరపడ్డారు. క్రియాశీలక రాజకీయాల్లో ఎప్పుడూ పాల్గొనకపోయినప్పటికీ ఆయన ఇద్దకు కుమారులు స్వర్గీయ దేవినేని వెంకటరమణ, దేవినేని ఉమామహేశ్వరరావుల ఎన్నికల ప్రచారంలో మాత్రం పాల్గొనేవారు. 2009, 2014 అస్లెంబీ ఎన్నికల్లో ఉమా మైలవరం నుంచి పోటీ చేసినప్పుడు శ్రీమన్నారాయణ ఈ ప్రాంత ప్రజలకు, నాయకులకు దగ్గరయ్యారు. ఆ రెండు ఎన్నికల్లో ఉమా విజయం సాధించారు. 2019లో ఆరోగ్యం సహకరించక శ్రీమన్నారాయణ ఎన్నికల ప్రచారంలో పాల్గొనలేదు. ఈ ఎన్నికల్లో ఉమా ఓటమి పాలయ్యారు. శ్రీమన్నారాయణకు నలుగురు కుమారులు, ఒక కుమార్తె. భర్త మరణవార్త తెలుసుకుని భార్య సీతమ్మ కన్నీరుమున్నీరుగా విలపించారు. అంత్యక్రియలు శుక్రవారం కంచికచర్లలో జరుగుతాయి. 

Advertisement
Advertisement