Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఆ మంత్రి నోరు గుడివాడ డ్రైనేజ్: దేవినేని ఉమ

నందిగామ: కృష్ణా జిల్లాలో ఉన్న ఓ మంత్రి నోరు గుడివాడ డ్రైనేజ్ అని పరోక్షంగా మంత్రి కొడాలి నానిని ఉద్దేశించి మాజీ మంత్రి, టీడీపీ నేత దేవినేని ఉమ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నందిగామలో మీడియా సమావేశంలో దేవినేని ఉమ  మాట్లాడారు. నందిగామలో నగర పంచాయతీ ఎన్నికలలో  టీడీపీ అభ్యర్థులను గెలిపిచాలని ప్రజలను ఆయన కోరారు. మన జిల్లాలో ఒక బూతుల మంత్రి ఉన్నాడని ఆయన విమర్శించారు.


ఆ మంత్రి నోరు గుడివాడ డ్రైనేజ్ అని, అది నిరంతరం కంపు కొడుతుందని ఆ మంత్రిని ఎద్దేవా చేశారు. 14 సంవత్సరాలు సీఎంగా పనిచేసిన వ్యక్తిపై ఆ విధంగా ఎవరైనా మాట్లాడతారా అని ఆయన విమర్శించారు. మనిషనే వాడు అలా మాట్లాడతాడా అని ఆ మంత్రిని దేవినేని ఉమ ప్రశ్నించారు. 

Advertisement
Advertisement