Abn logo
Oct 25 2020 @ 05:27AM

మహాదుర్గగా అమ్మవారు

Kaakateeya

త్రిపురాంతకం, అక్టోబరు 24 :  శ్రీబాలాత్రిపురసుందరీదేవి అమ్మవారు నందివాహనంపై శ్రీమహాదుర్గా అ లంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారు ఆది వారం విజయదశమి సందర్భంగా రాజరాజేశ్వరి అలంకారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం త్రిపురాంతకేశ్వరస్వామి, బాలాత్రిపుర సుందరీదేవి అమ్మవార్ల ఆలయాల్లో మంత్రి డాక్టర్‌ ఆదిమూలపు సురేష్‌ ప్రత్యేక పూజలు చేశారు.


మార్కాపురం (వన్‌టౌన్‌) : జగదాంబసమేత మా ర్కండేశ్వరస్వామి ఆలయం, అమ్మవారిశాలలో అమ్మ వార్లు మహిషాసుర మర్దిని అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీ లక్ష్మీనారాయణస్వామి ఆలయంలో అమ్మవారు శ్రీ విజయలక్ష్మీదేవిగా, శ్రీ లక్ష్మీచెన్నకేశవస్వామి ఆలయంలోని అమ్మవారు గాయత్రీదేవిగా కొలువు దీరారు. 


పొదిలి  : పట్టణంలోని వాసవీ కన్యకపరమేశ్వరి ఆలయంలోని అమ్మవారు శనివారం భవానీ దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. 


గిద్దలూరు :  అమ్మవారిశాలలో శ్రీవాసవీ కన్యకాపరమేశ్వరి అ మ్మవారు మహిషాసురమర్దిని అలంకారంలో భక్తులకు దర్శనం ఇచ్చారు. షరాఫ్‌ బజారులోని శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా కల్యాణం నిర్వహించారు. 


కనిగిరి : మండల పరిధిలోని నందనమారెళ్ల బాలార్క కోటేశ్వర స్వామి ఆలయంలో గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా వెంకట రాంబాబు కుటుంబ సమేతంగా శనివారం చంఢీ యాగం నిర్వహించారు.  శనివారం వెంకటేశ్వరస్వామి, దుర్గామాత ఆలయంలో, దొంతుల మ్మ దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంకాలమ్మ, వా సవీ అమ్మవారు మహిషాసురమర్దినిగా భక్తులకు దర్శనమిచ్చారు.  సీఎస్‌పురంలోని కామాక్షి సమేత చంద్రమౌళీశ్వర స్వామి, రాచూరి పెద్దమ్మ దేవస్థానాలలో శనివారం ప్రత్యేక పూజలు నిర్వ హించారు.  పెద్దమ్మతల్లి, కామా క్షమ్మతల్లి అమ్మవార్లు మహిషా సురమర్దినిగా దర్శన మిచ్చారు. భైరవకోనలోని త్రిముఖ దు ర్గాంబా దేవి అమ్మ వారు శాఖాంబరీదేవిగా దర్శనమిచ్చారు. 


దర్శి: దేవీ నవరాత్రులు సందర్భంగా అమ్మవారి ఆలయాలు భ క్తులతో కిటకిటలాడాయి. వాసవీ కన్యకా పరమేశ్వరీ, కనకదుర్గమ్మ, దద్దాలమ్మ, పోలేరమ్మ ఆల యాల్లో అమ్మవారు దుర్గాదేవిగా, మహిషాసుర మర్దినిగా దర్శనమిచ్చారు. 

Advertisement
Advertisement