Abn logo
Sep 23 2020 @ 01:02AM

అభివృద్ధి పనులు త్వరగా పూర్తవ్వాలి : కలెక్టర్‌

కొడంగల్‌: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన రైతువేదిక, పల్లె ప్రకృతివనం, వైకుంఠధామం తదితర పనులు త్వరితగతిన పూర్తిచేయాలని కలెక్టర్‌ పౌసుమిబసు సర్పంచులు, అధికారులను ఆదేశించారు. మంగళవారం కొడంగల్‌ మండలం రావుల్‌పల్లి, ఇందనూర్‌, ఎరన్‌పల్లి, ఆలేడ్‌, పర్సాపూర్‌ గ్రామాల్లో పర్యటించిన కలెక్టర్‌ వివిధ పనులను పరిశీలించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ మండలంలో రైతు వేదిక భవన నిర్మాణ పనులు నత్తనడకన కొనసాగుతున్నాయని అసంతృప్తి వ్యక్తం చేశారు. అక్టోబర్‌ నెలలోగా పూర్తిచేయాలని ఆదేశించారు. ఇందనూర్‌లో రైతు వేదిక, వైకుంఠధామం ప్రారంభించకపోవడంపై అధికారులపై ఆగ్రహం వ్యక్తంచేశారు. రోజురోజుకు పనుల వివరాలను ఫొటోల ద్వారా తనకు వాట్సాప్‌లో పంపించాలన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో అశోక్‌కుమార్‌, తహసీల్దార్‌ శివకుమార్‌, ఎంపీడీవో సుజాత, పీఆర్‌డీఈ ఉమేశ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు. 

Advertisement
Advertisement
Advertisement