Abn logo
Apr 17 2021 @ 00:50AM

అభివృద్ధి పనులను గడువు లోగా పూర్తి చేయాలి

జిల్లా కలెక్టర్‌ ముషారఫ్‌ ఫారూఖీ

నిర్మల్‌ టౌన్‌, ఏప్రిల్‌ 16 : జిల్లాలో పట్టణ, పల్లె ప్రగతిలో భాగంగా చేపట్టిన అభివృద్ధి పనులను గడువులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‌ ముషారఫ్‌ ఫారూఖీ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్‌ చాంబర్‌లో నిర్మల్‌, ఖానాపూర్‌, భైంసా మున్సిపల్‌ కమిషనర్లతో సమీక్షా సమావేశం నిర్వహిం చారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ ముషారఫ్‌ ఫారూఖీ మాట్లాడుతూ ఇంటి గ్రేటెడ్‌ మార్కెట్‌, డంపింగ్‌ యార్డులు, శ్మశానవాటికలు, పల్లె ప్రకృతి వనాలు, నర్సరీల నిర్మాణాల పనులపై సమీక్షించారు. జిల్లాలో పట్టణ ప్రగతిలో చేప ట్టిన అభివృద్ధి పనుల నిర్మాణాలను వేగవంతంగా పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురావాలని అధికారులకు సూచించారు. పల్లెప్రకృతివనాలు, నర్సరీలలో మొక్కల సంరక్షణకు చర్యలు చేపట్టాలన్నారు. పెండింగ్‌లో ఉన్న శ్మశాన వాటికలు ఈ మాసం చివరినాటికి  పూర్తి చేయాలని అన్నారు. 

ఖానాపూర్‌లో 3 నర్సరీలలో ఇచ్చిన టార్గెట్‌ను వారంలోగా పూర్తి చేయాలని, లక్ష్యాలను చేరుకోవడంలో వెనుకబడి ఉందని, వారంలోగా పూర్తి చేయాలని ఖానాపూర్‌ మున్సిపల్‌ కమిషనర్‌ను ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్‌లు హేమంత్‌ బోర్కడే డా.పి.రాంబాబు, ఇంజనీర్లు, తదితరులు పాల్గొన్నారు. 


Advertisement
Advertisement