Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఉపాధి హామీ పథకంతో గ్రామాలు అభివృద్ధి

ఆత్మకూర్‌(ఎస్‌), డిసెంబరు 2: గ్రామాల  అభివృద్ధికి ఉపాధి హామీ పథకం దోహదపడుతుందని అదనపు కలెక్టర్‌ హేమంత్‌కేశవ్‌పాటిల్‌ అన్నారు. ఉపాధి హామీ పథకం, పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి పనులపై మండల ప్రజాపరిషత్‌ కార్యాలయంలో గురువారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉపాధి కూలీలకు 100కు తగ్గకుండా పని దినాలు కల్పించాలన్నారు. హరితహారం మొక్కలను అన్ని నర్సరీల్లో పెంచాలని, వాటిని పశువుల నుంచి కాపాడేందుకు నర్సరీలకు ప్రహరీలు ఏర్పాటు చేయాలన్నారు. హరితహారంలో నాటిన ప్రతీ మొక్క బతికేలా చూడాలన్నారు. గ్రామ పంచాయతీల్లో ఇంకుడుగుంతలు నిర్మించుకునేలా ప్రజలకు అధికారులు అవగాహన కల్పించాలన్నారు. గ్రామాల్లో ప్రతీ ఒక్కరు వ్యాక్సినేషన్‌ వేయించుకునే విధంగా కృషి చేయాలన్నారు. సమావేశంలో జడ్పీ సీఈవో సురేష్‌, డీఆర్‌డీవో కిరణ్‌కుమార్‌, డీపీవో యాదయ్య, ఏపీడీ రాజు, ఎంపీడీవో మల్సూర్‌, ఎంపీవో సంజీవ పాల్గొన్నారు. 

Advertisement
Advertisement