Abn logo
Sep 17 2021 @ 00:14AM

తెలుగుదేశం పార్టీతోనే అభివృద్ధి సాధ్యం

కోడూరి కుటుంబాలను టీడీపీలోకి ఆహ్వానిస్తున్న దామచర్ల జనార్దన్‌

రాష్ట్ర ఉపాధ్యక్షుడు దామచర్ల

టీడీపీలో చేరిన పలువురు వైసీపీ వర్గీయులు


కొత్తపట్నం(ఒంగోలునగరం), సెప్టెంబరు 16: తెలుగుదేశం పార్టీతోనే అ భివృద్ధి సాధ్యమని రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌ పే ర్కొన్నారు. గురువారం కొత్తపట్నంలోని జరిగిన కార్యక్రమంలో వైసీపీ వర్గీయులు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. కొత్తపట్నం రెడ్డిపాలెంలో కోడూరి ఇంటి పేరు కలిగిన 10 కుటుంబాలు ఇప్పటి వరకు వైసీపీలో ఉన్నాయి. గతం లో ఆయా కుటుంబాల వారు టీ డీపీలో ఉన్నారు. అయితే ఇటీవల కాలంలో ఆ పార్టీ నాయకుల వై ఖరితో అసంతృప్తిగా ఉన్న వీరు దామచర్ల జనార్దన్‌ సమక్షంలో టీ డీపీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదే శం పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.


భారీగా ‘రైతు కోసం తెలుగుదేశం’ ర్యాలీ


రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అ నుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను నిరసి స్తూ గురువారం టీడీపీ ఆధ్వర్యంలో కొత్తపట్నం లో రైతుకోసం తెలుగుదేశం పేరులతో భారీగా ర్యాలీని మాజీ ఎమ్మెల్యే దామచర్ల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ రహదా రుల్లో ఎండ్లబండిపై తహసీల్దార్‌ కార్యాలయం వ రకు ర్యాలీ కొనసాగింది. అనంత రం జరిగిన సభలో దామచర్ల మా ట్లాడుతూ సీఎం జగన్మోహనరెడ్డి పాదయాత్రలో ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి రైతు వ్యతిరేక వి ధానాలను ఆవలంభిస్తున్నారని వి మర్శించారు. రైతుల పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించా లని ఆయన డిమాండ్‌ చేశారు. కా ర్యక్రమంలో రాష్ట్ర రైతు విభాగం కార్యనిర్వాహక కార్యదర్శి పోల వరపు వెంకట్రామయ్య, బలగాని వెంకటనారాయణ, మండల అధ్య క్షులు బలగాని వెంకటేశ్వర్లు, గేనం సుబ్బారావు, మాజీ ఏఎంసీ చైర్మన్‌ కామేపల్లి శ్రీనివాసరావు, మాజీ ఎంపీపీ నాళం నరసమ్మ తదితరులు పాల్గొన్నారు.