Advertisement
Advertisement
Abn logo
Advertisement

తిరుమల రెండవ ఘాట్‌లో కొండరాళ్ల విధ్వంసం

( ఆంధ్రజ్యోతి,తిరుమల/తిరుపతి)

తిరుమల రెండవ ఘాట్‌రోడ్డులో బుధవారం ఉదయం  కొండరాళ్లు విరిగిపడడంతో భారీగా రోడ్డు ధ్వంసమైంది. కొన్ని ప్రదేశాల్లో రోడ్డు కుంగిపోగా, మరికొన్ని ప్రదేశాల్లో కిందభాగానికి కొట్టుకుపోయింది.నాలుగు ప్రాంతాల్లో ఘాట్‌రోడ్డు తీవ్రంగా దెబ్బతినడంతో తిరుమలకు రాకపోకలను ఆపివేశారు.మొదట రెండవ ఘాట్‌రోడ్డులో నిలిచిపోయిన వాహనాలను లింక్‌ రోడ్డు గుండా తిరుమలకు అనుమతించారు.ఆ తర్వాత మొదటి ఘాట్‌రోడ్డులో  కొంత సమయం వాహనాలను కిందకు పంపితే మరికొంత సమయం కింద వాహనాలను పైకి పంపారు. ఇదే విధానం మరో రెండురోజుల పాటు కొనసాగే అవకాశముంది.దాదాపు 10 బృందాలు ఘాట్‌రోడ్డు మరమ్మతు పనుల్లో నిమగ్నమయ్యాయి.  ఈ క్రమంలో అటు అలిపిరిలో, ఇటు తిరుమలలో ఎక్కువసేపు వేచివుండాల్సి రావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. 


రెండవ ఘాట్‌రోడ్డులో మరమ్మతులు


Advertisement
Advertisement