Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఏనుగుల దాడిలో పంటల ధ్వంసం

సోమల, నవంబరు 27: సోమల మండలంలో గజరాజుల సంచారంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. శుక్రవారం రాత్రి ఏనుగులు పేటూరు గ్రామ సమీపంలోని వరి, వేరు శనగ పంట పొలాల్లో సంచరించి పంటలను ధ్వంసం చేశాయి.కోతకు సిద్ధంగా ఉన్న వరి పొలాల్లో ఏనుగులు పంటలను తొక్కివేయడంతో రైతులు దేశయ్య, చిట్టిబాబు ఆవేదన వ్యక్తం చేశారు. నెల రోజులుగా అన్నెమ్మగారిపల్లె, ఆవులపల్లె, పేటూరు పంచాయతీల్లో పంట పొలాల్లోనే ఏనుగులు సంచరిస్తున్నా  అటవీ అధికారులు స్పందించడంలేదన్నారు. పట్రపల్లె వైపు మూడు ఏనుగులు దారి మళ్లి వస్తున్నట్లు అటవీశాఖ అధికారులు సమాచారం ఇవ్వడంతో రెడ్డివారిపల్లె, కొత్తూరు, పట్రపల్లె ప్రజలు పొలాల వద్దకు వెళ్లకుండా ఇళ్ల ముందు మంటలు వేసుకొని జాగరణ చేసినట్లు గ్రామస్తులు తెలిపారు.

Advertisement
Advertisement