Advertisement
Advertisement
Abn logo
Advertisement

అతిపెద్ద చెట్టుకు అల్యూమినియం పొర

వాషింగ్టన్: కాలిఫోర్నియాలోని అటవీ ప్రాంతంలో అగ్నిప్రమాదం సంభవించడంతో ప్రపంచంలోనే అతి పెద్దదైన ఒక చెట్టును కాపాడటానికి అధికారులు ఆగమేఘాల మీద చర్యలు తీసుకుంటున్నారు. ఇక్కడి సీకోయా జాతీయ ఉద్యానవనంలో ఉన్న జనరల్ షర్మన్ అనే చెట్టు ప్రపంచంలోనే అతి పెద్దది. ఆ వృక్షాన్ని కాపాడేందుకు మంటలు తట్టుకుని నిలబడే అల్యూమినియం పొరను దాని చుట్టూ కప్పుతున్నారు. సుమారు 275 అడుగుల ఎత్తులో ఉండి 52,508 క్యూబిక్ ఫీట్ల విస్తీర్ణంలో ఆవరించి ఉన్న ఈ వృక్షం వయసు దాదాపుగా 2,200 ఏళ్లు ఉంటుందని అంచనా. ఈ వృక్షం దట్టమైన అడవిలో 2,200 సీకోయా చెట్ల మధ్య విస్తరించి ఉంది. 


ఈ జనరల్ షర్మన్ వృక్షానికి మంటలు అంటుకునే అవకాశం ఉండటంతో దాని చుట్టూ అల్యూమినియం పొరను కప్పుతున్నామని పార్కు అధికారులు గురువారం తెలిపారు. ఈ అల్యూమినియం పొర తీవ్రమైన అగ్నిని కూడా తట్టుకుంటుందని వారు చెబుతున్నారు.  ‘‘వాతావరణ మార్పులు తీవ్రంగా ఉండటంతో వడగాలులు వీస్తున్నాయి. ఫలితంగా అగ్నిప్రమాదాలు సంభవిస్తున్నాయి’ ’అని సీకోయా జాతీయ ఉద్యానవన విపత్తు కార్యనిర్వహణాధికారి తెలిపారు. అందువల్ల భారీ వృక్షాలను కాపాడటానికి ఇటువంటి చర్యలు చేపట్టాల్సి వస్తుందని వివరించారు.

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement