Abn logo
Sep 17 2021 @ 00:09AM

ఇళ్లు పూర్తయ్యేలోపు మౌలిక వసతుల కల్పన

భూమిపూజలో పాల్గొన్న కృష్ణచైతన్య

శాప్‌నెట్‌ చైర్మన్‌ కృష్ణచైతన్య 


అద్దంకి, సెప్టెంబరు 16 : జగనన్న కాలనీలలో ఇళ్ల నిర్మాణం పూర్తయ్యేలోపు అన్ని మౌలిక వసతులు కల్పిస్తామని శాప్‌నెట్‌ చైర్మన్‌, వైసీపీ  ని యోజకవర్గ ఇన్‌చార్జి బా చిన కృష్ణచైతన్య అన్నారు. అద్దంకిలోని నాగులపాడురోడ్డులోని  జగనన్న కాలనీలో 507 ఇళ్ల నిర్మాణాలకు గురువారం శంకుస్థాపనలు జరిగాయి. ముఖ్య అతిథిగా హాజరైన కృష్ణచైతన్య మాట్లాడు తూ నిర్మాణాలకు ఇసుక కొరత లేకుండా చర్యలు చేపట్టామన్నా రు. ఉగాది నాటికి అన్ని నిర్మాణాలు పూర్తి కావాలన్నారు. ఈ కా ర్యక్రమంలో నగరపంచాయతీ చైర్‌పర్సన్‌ ఎస్తేరమ్మ, వైస్‌చైర్మన్‌లు దేసు పద్మేష్‌, అనంత లక్ష్మి, కమిషనర్‌ ఫజులుల్లా, హౌసింగ్‌ డీఈ శర్మ, మాజీ ఎంపీపీ జ్యోతి హనుమంతరావు, పట్టణ అధ్యక్షుడు కాకాని రాధాకృష్ణమూర్తి, పీడీసీసీ మాజీ డైరెక్టర్‌ సందిరెడ్డి రమేష్‌, తహసీల్దార్‌ ప్రభాకరరావు, ఎంపీడీవో రాజేందర్‌, గూడా శ్రీనివాసరెడ్డి,  కొల్లా భువనేశ్వరి, కౌన్సిలర్లు సుధీర్‌, నాగరాజు, కో టేశ్వరరావు, జబ్బార్‌, రత్నకుమారి, సురేష్‌ పాల్గొన్నారు.