Abn logo
Sep 9 2020 @ 03:57AM

దూరదృష్టితో సీఎం పథకాల రూపకల్పన

Kaakateeya

ఆమనగల్లు/తలకొండపల్లి: ప్రజా సంక్షేమం కోసం సీఎం కేసీఆర్‌ దూరదృష్టితో సంక్షేమ పథకాలకు రూపకల్పన చేశారని ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, నాగర్‌ కర్నూల్‌ ఎంపీ పోతుగంటి రాములు అన్నారు. తలకొండపల్లి, ఆమనగల్లు మండలాల్లో మంగళవారం వారు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. తలకొండపల్లి మండలం వెల్జాల, మెదక్‌పల్లిలో మిషన్‌భగీరథ వాటర్‌ట్యాంక్‌, అదనపు తరగతి గదులను ప్రారంభించారు.


మాదాయి పల్లి నుంచి మెదక్‌పల్లి వరకు రూ.4.38కోట్లతో, జంగారెడ్డిపల్లి నుంచి తలకొండపల్లి వరకు రూ.2.63కోట్లతో, పీడబ్ల్యూ రోడ్డు నుంచి వెంకట్రావ్‌ పేట మీదుగా ఆర్లకుంటతాండా వరకు రూ.1.26కోట్లతో, కేఎంకేఎల్‌ పీడబ్ల్యూ రోడ్డు నుంచి బలుసులపల్లితండా వరకు రూ.75లక్షలు, బలుసులపల్లి నుంచి చింతలపల్లి వరకు రూ.82.50లక్షలు, ఆమనగల్లు మండలం శ్రీశైలం - హైద్రాబాద్‌ జాతీయ రహదారి నుంచి మేడిగడ్డ మీదుగా శంకర్‌కొండతండా వరకు రూ.3.27కోట్లతో చేపట్టే బీటీరోడ్ల నిర్మాణాలకు వారు శంకుస్థాపన చేశారు.


గుడితండాలో మిషన్‌ భగీథర వాటర్‌ట్యాంక్‌ను జడ్పీటీసీలు వెంకటేశ్‌, అనురాధ పత్యనాయక్‌, ఎంపీపీ నిర్మలాశ్రీశైలంగౌడ్‌, అనితావిజయ్‌తో కలిసి ఎంపీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు ప్రారంభించారు. కార్యక్రమంలో డీఈ తిరుపతిరెడ్డి, ఏఈలు విద్యాసాగర్‌, కృష్ణయ్య, ఎంపీడీవోలు, కో-ఆప్షన్‌ మెంబర్‌ ముజీబుర్‌ రహ మాన్‌, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకులు గోలి శ్రీనివాస్‌రెడ్డి, వైస్‌ ఎంపీపీలు అనంతరెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, మండల రైతు సమన్వయ సమితి కో-ఆర్డినేటర్‌ దశరథ్‌నాయక్‌, మాజీ ఎంపీపీ శ్రీనివాస్‌యాదవ్‌, సర్పంచ్‌లు సంగీత, చంద్రయ్య, ధరణి, వరలక్ష్మి, లింగమ్మ, హైమావతి, అమర్‌సింగ్‌, నేనావత్‌ లచ్చి, ఎంపీటీసీలు అంబాజీ, సరితాగణేశ్‌, నాయకులు ఎన్‌.శ్రీనివాస్‌రెడ్డి, నిట్ట నారాయణ, తదితరులు పాల్గొన్నారు. 


ప్రభుత్వం ఇచ్చిన మాటలను నిలబెట్టుకుంది

మేడిగడ్డ - శంకర్‌కొండతండా బీటీరోడ్డు నిర్మాణ విషయంలో  ప్రభుత్వం ఇచ్చిన మాటను నిలుపుకుందని ఎంపీ రాములు, ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. మండలం మేడిగడ్డ పంచాయతీ పరిధిలోని గుడితండాలో రూ.5లక్షలతో చేపట్టే సీసీరోడ్డు నిర్మాణ పనులను టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు గోలి శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీపీ అనితావిజయ్‌, జడ్పీటీసీ అనురాధ, వైస్‌ ఎంపీపీ జక్కు అనంతరెడ్డి, సర్పంచ్‌ అమర్‌సింగ్‌తో కలిసి ప్రారంభించారు. 

Advertisement
Advertisement