Abn logo
Jan 21 2021 @ 14:49PM

మత పిచ్చి ,కుల పిచ్చి ఎక్కువైంది: డిప్యూటీ సీఎం

చిత్తూరు: మాజీ సీఎం చంద్రబాబు నాయుడు‌పై డిప్యూటీ సీఎం నారాయణస్వామి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడు పుట్టడమే కుట్రతో పుట్టాడన్నారు. రాజకీయాలు కుట్రతోనే కొనసాగిస్తున్నాడని విమర్శించారు. విద్యార్థి దశలోనే చంద్రబాబు కమ్మ రెడ్డి వర్గాలుగా విడదీసి రాజకీయం చేశారన్నారు. తెలుగుదేశం పార్టీలో ప్రతి ఒక్కరూ పిచ్చి పట్టి పిచ్చి కుక్కలుగా వ్యహరిస్తున్నారని పేర్కొన్నారు. ఇంటింటికి బియ్యం పంపిణీకి సంబంధించి ఏర్పాటైన వాహనాలను సైతం చంద్రబాబు రాజకీయం చేయబోతున్నారని చెప్పారు. మత పిచ్చి ,కుల పిచ్చి ఎక్కువైందన్నారు. కులాలను, మతాలను, రాజకీయాలు రెచ్చగొట్టే ప్రయత్నాలు చంద్రబాబు నాయుడు చేస్తున్నాడని చెప్పారు.  

Advertisement
Advertisement
Advertisement