Advertisement
Advertisement
Abn logo
Advertisement

విదేశీ ప్రయాణికులకు ఆర్టీపీసీఆర్‌ టెస్ట్‌లు: డిప్యూటీ సీఎం ఆళ్ల

అమరావ‌తి: విదేశాల నుంచి రాష్ట్రానికి వచ్చే అంతర్జాతీయ ప్రయాణికులకు ఆర్టీపీసీఆర్‌ టెస్ట్‌లు చేయాలని నిర్ణయించినట్లు ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని తెలిపారు. తాడేప‌ల్లి క్యాంపు కార్యాల‌యంలో సీఎం అధ్యక్షతన  కోవిడ్‌పై జరిగిన సమీక్ష ముగిసింది. అనంతరం మంత్రి నాని మాట్లాడుతూ రిపోర్ట్‌లో పాజిటివ్ వ‌స్తే క్వారంటైన్‌కు పంపుతామన్నారు. ఏపీలో వ్యాక్సినేషన్‌ స్పీడ్‌ పెంచాలని సీఎం జగన్‌ ఆదేశించారన్నారు. జనవరి 15లోగా రెండు డోసుల వ్యాక్సినేషన్ పూర్తిచేయాలన్నారు. వ్యాక్సినేషన్‌పై ప్రజల్లో అవగాహన పెంచుతామన్నారు. రాష్ట్రంలో ఓమిక్రాన్ వేరియంట్ ప్రవేశిస్తే ఏం చేయాలనే దానిపై  చ‌ర్చించామన్నారు.  రేపు మ‌రోసారి న్యూ వేరియంట్, కోవిడ్ నియంత్రణపై  సీఎం నేతృత్వంలో స‌మావేశం అవుతామన్నారు.


Advertisement
Advertisement