Advertisement
Advertisement
Abn logo
Advertisement

పిప్పల్ కోటి అగ్నిప్రమాదంపై కార్మిక శాఖ సీరియస్

ఆదిలాబాద్: జిల్లాలోని  భీంపూర్‌ మండలంలోగల పిప్పల్ కోటి లేబర్ క్యాంపులో జరిగిన అగ్నిప్రమాదంపై కార్మిక శాఖ సీరియస్ అయింది. ఈ ప్రమాదంలో కార్మికుడు సుఖ్ లాల్ సజీవ దహనమయ్యారు. దీంతో ఇరిగేషన్ ఎస్ఈ, కాంట్రాక్టర్, సబ్ కాంట్రాక్టర్లకు  కార్మిక శాఖ నోటీసులు జారీ చేసింది. 


భీంపూర్‌ మండలంలోని పిప్పల్‌కోటి సమీపంలో పెన్‌గంగా నదిపై నిర్మిస్తున్న లిఫ్ట్‌ ఇరిగేషన్‌ పనుల వద్ద ఆదివారం భారీ అగ్ని ప్రమాదం సంభవించిన విషయం తెలిసిందే. పెన్‌గంగా రిజర్వాయర్‌కు సంబంధించిన కూలీల శిబిరంలో ఆదివారం సాయంత్రం వంట చేస్తున్న క్రమంలో సిలిండర్‌ పేలింది. దీంతో శిబిరంలో ఉన్న డీజిల్‌, ఇతర పేలుడు పరికరాలు అంటుకొని మంటలు వ్యాపించి పనులకు సంబంధించిన టిప్పర్లు, పొక్లెయినర్‌లు కాలిపోయాయి. ఘటనలో మధ్యప్రదేశ్‌కు చెందిన షుక్‌లాల్‌(55) సజీవ దహనమయ్యాడు. విషయం తెలిన వెంటనే భీంపూర్‌ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆదిలాబాద్‌కు చెందిన ఫైర్‌ ఇంజన్లు వచ్చి మంటలను అదుపులోకి తెచ్చాయి. ఆస్తి నష్టం సుమారుగా రూ.3కోట్లుగా ఉంటుందని ప్రాథమికంగా అంచనా వేశారు. స్థానిక ఎస్సై ఎండీ అరీఫ్‌ సిబ్బంతో ఘటనా స్థలానికి చేరుకున్నారు. సర్పంచ్‌ కరీం, వైస్‌ ఎంపీపీ గడ్డం లస్మన్న, మధ్యప్రదేశ్‌లోని బాధితుల కుటుంబ సభ్యులకు సమాచారం అందిచారు. బాధిత కూలీలకు కావాల్సిన సౌకర్యాలు కల్పిస్తున్నారు.


Advertisement
Advertisement