Abn logo
Oct 22 2021 @ 22:29PM

ఉన్నత పాఠశాలను తనిఖీ చేసిన డీఈవో

లక్షెట్టిపేట బాలికల ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులతో మాట్లాడుతున్న డీఈవో వెంకటేశ్వర్లు

 లక్షెట్టిపేట, అక్టోబరు 22: లక్షెట్టిపేట పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాలను శుక్రవారం డీఈవో వెంకటేశ్వర్లు తనిఖీ చేశారు. పాఠశాలలో విద్యార్థుల హాజరు తీరు పరిశీలిస్తూ కొవిడ్‌ నిబంధనలు పాటిస్తున్నారా అనే అంశంపై విద్యార్థులను తెలుసుకున్నారు. మాస్కులు, శానిటైజర్ల వాడకంపై వివరాలను అడిగారు. పాఠశాలలో మధ్యాహ్న భోజనం తీరును పరిశీలించారు. భవిత సెంటర్‌ను పరిశీలించారు. డీఈవో వెంట ఎంఈవో రవీందర్‌, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు యశోదర, ఉపాధ్యాయులు , విద్యార్థులు ఉన్నారు. 

 హాజీపూర్‌: కర్ణమామిడిలో నిర్మిస్తున్న కస్తూర్బా విద్యాలయం భవన నిర్మాణ పనులను శుక్రవారం డీఈవో వెంకటేశ్వర్లు పరిశీలించారు. నిర్మాణ పను లను నాణ్యతతో చేపట్టాలని, పనులను త్వరగా పూర్తి చేయాలని విద్యాశాఖ ఇంజనీర్‌కు సూచించారు.