Abn logo
Oct 24 2020 @ 05:06AM

పాఠశాలల్లో అన్ని జాగ్రత్తలు తీసుకోండి

హెచ్‌ఎం సమావేశంలో డీఈవో లింగేశ్వరరెడ్డి


కొత్తూరు, అక్టోబరు 23: పాఠశాలల్లో కొవిడ్‌ నివారణకు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా విద్యా శాఖాధికారి బి.లింగేశ్వరరెడ్డి ఆదేశించారు. స్థానిక ఏఎంఏఏ ఉన్నత పాఠశాలలో శుక్రవారం డివిజన్‌ పరిధిలోని 22 మండలాల హైస్కూలు హెచ్‌ఎంలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అన్ని పాఠశాలల్లోనూ శానిటైజేషన్‌ చేయించాలని, మాస్కు లేని విద్యార్థులను పాఠశాలకు అనుమతించరాదని స్పష్టం చేశారు. జిల్లాలో సుమారు రెండు వేల మంది ఉపాధ్యాయులు బదిలీ అయ్యారని చెప్పారు. సమావేశంలో విద్యా శాఖ అధికారులు సత్యనారాయణ, వెంకటేశ్వరరావు, హెచ్‌ఎంల సంఘం అధ్యక్షుడు శాస్ర్తి, ఏఎంఏఏ స్కూల్‌ ప్రిన్సిపాల్‌ లావణ్య పాల్గొన్నారు. 

Advertisement
Advertisement