Advertisement
Advertisement
Abn logo
Advertisement

వంట బిల్లులు మంజూరు చేయాలి

గంపలగూడెం, నవంబరు 29: ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం నిర్వహిస్తున్న వంట ఏజెన్సీలకు బిల్లులు, జీతాలు మంజూరు చేయకపోవడంపై ఎంఈవో కార్యాలయం ఎదుట ఏఐటీయూసీ ఆధ్వర్యంలో సోమవారం వంట ఏజెన్సీలు ధర్నా చేశాయి. ఏఐటీయూసీ గౌరవాధ్యక్షుడు షేక్‌ నాగుల్‌మీరా మాట్లాడుతూ.. ఆగస్టు 1 నుంచి ప్రభుత్వ పాఠశాలలు పని చేస్తున్నాయని, నాలుగు నెలలుగా ప్రతి బిల్లును పాఠశాలల్లోని ప్రధానోపాధ్యాయులు ప్రభుత్వానికి పంపుతున్నా..ఇంత వరకు డబ్బులు విడుదల కాలేదన్నారు. జీతాలు ఇవ్వక, వంట బిల్లులు రాక నిర్వాహకులు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారన్నారు. కిరాణా షాపుల్లో అప్పులు పెరిగి సరుకులు ఇవ్వడం లేదన్నారు. ఏజెన్సీ నిర్వాహకుల వద్ద ఉన్న బంగారం, వెండి తాకట్టు పెట్టి కిరాణా సరుకులు తెస్తున్నారన్నారు. ఆగిన జీతాలు, వంట బిల్లులు వెంటనే మంజూరు చేయాలని కోరారు. పలు వంట ఏజెన్సీల నిర్వాహకులు పాల్గొన్నారు. 


Advertisement
Advertisement