Abn logo
Aug 8 2020 @ 08:15AM

భార్య ఫోన్‌ను దొంగిలించిన భర్త.. సీన్ రివర్స్!

న్యూఢిల్లీ: భార్య సెల్‌ఫోన్‌ను చోరీ చేసిన భర్తను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఢిల్లీకి చెందిన వినోద్ అనే వ్యక్తి..తన భార్య సెల్‌పోన్ దొంగిలించాడు. తనను వదిలిపెట్టేసి వెళ్లిపోయిన ఆమెకు గుణపాఠం చెప్పాలని  అతడు ఈ పనికి పూనుకున్నాడు. ఇటీవల ఆమె ఇంట్లోకి ప్రెవేసించి కత్తితో బెదిరిస్తూ ఆమె ఫోన్  దొంగిలించాడు. అంతేకాకుండా.. త్వరలో దారుణ పరిస్థితి ఎదుర్కోబోతున్నావంటూ హెచ్చరిక చేసి పారిపోయాడు. దీంతో కంగారు పడ్డ మహిళ వెంటనే పోలీసులకు సమాచారం అందించింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు అతడి కోసం వల పన్ని ఇటీవల అదుపులోకి తీసుకున్నారు. భార్యకు గుణపాఠం చెప్పబోయిన నిందితుడు సీన్ రివర్స్ అవడంతో తనే పోలీసులకు చిక్కాడు. కాగా.. విచారణ సందర్భంగా వినోద్ పోలీసుల ఎదుట చేసిన నేరాన్ని ఒప్పుకున్నాడు. తను తరచూ బస్సుల్లో ఫోన్లు దొంగిలిస్తుంటానని, ఇందు కోసం తనకు మరో ముగ్గురు స్నేహిుతులు కూడా సహాయం చేస్తుంటారని చెప్పుకొచ్చాడు. దీంతో పోలీసులు ఆ ముగ్గురిని కూడా అదుపులోకి తీసుకున్నారు.  

Advertisement
Advertisement
Advertisement