Abn logo
May 11 2021 @ 15:50PM

థర్డ్ వేవ్‌ను తట్టుకునేలా ఢిల్లీ ప్రభుత్వం ఏర్పాట్లు

న్యూఢిల్లీ: దేశంలో కరోనా విజృంభన కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో ఢిల్లీలో లాక్ డౌన్‌ను ఈనెల 17వ తేదీ వరకు అక్కడి ప్రభుత్వం పొడిగించింది. దీంతో ఢిల్లీ రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. థర్డ్ వేవ్‌ను సయితం తట్టుకునేలా అన్ని ఏర్పాట్లు చేస్తోంది. బెడ్లు, ఆక్సిజన్ సదుపాయాలను పెంచుకుంటోంది. అత్యవసర సేవలు మినహా ఇతర సేవలన్నింటిని బంద్ చేసింది. పోలీసులు ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనికీ చేస్తున్నారు. గడిచిన 24 గంటల్లో ఢిల్లీలో 12వేలకుపైగా కరోనా పాజిటీవ్ కేసులు నమోదుకాగా... 330మంది మృతి చెందారు.

Advertisement