Advertisement
Advertisement
Abn logo
Advertisement
Jul 23 2021 @ 11:13AM

ఢిల్లీలో రెండో రోజు కొనసాగుతున్న రైతుల ఆందోళన

న్యూఢిల్లీ: నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ ఢిల్లీ జంతర్ మంతర్‌లో రైతులు చేస్తున్న ఆందోళన రెండో రోజుకు చేరింది. 200 వందల మంది రైతులకు మాత్రమే నిరసన తెలిపేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీంతో రోజుకు 200 వందల మంది చొప్పున రైతులు తమ నిరసనను తెలియజేస్తున్నారు. రైతుల ఆందోళన నేపథ్యంలో ఢిల్లీ జంతర్ మంతర్‌లో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. పార్లమెంట్‌కు వెళ్లే అన్ని దారులను మూసివేశారు. పార్లమెంట్ చుట్టుపక్కల  ఉన్న అన్ని మెట్రో స్టేషన్లను అధికారులు మూసివేశారు. పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. దాదాపు 9 నెలల నుండి రైతుల ఆందోళన కొనసాగుతున్న విషయం తెలిసిందే. 

Advertisement
Advertisement