Abn logo
Sep 25 2020 @ 01:29AM

మహనీయుల చరిత్రను తొలగించడం దారుణం

ములుగుటౌన్‌, సెప్టెంబరు 24: ఇంటర్‌ సిలబస్‌ నుంచి మహనీయుల చరిత్రకు సంబంధించిన పాఠ్యాంశాలను తొలగించడం దారుణమని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా  కార్యదర్శి కుమ్మరి సాగర్‌ విమరిచారు. జిల్లాకేంద్రంలో గురువారం నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. బారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌, మహత్మ జ్యోతిరావుపూలే, పెరియార్‌ లాంటి మహానీయుల చరిత్రను రాష్ట్ర ప్రభుత్వం పాఠ్యపుస్తకాల నుంచి తొలగించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.   అలాగే రాష్ట్రంలో ఉన్న అన్ని యూనివర్సిటీల వీసీలను నియమించి నిధులు కేటాయించాలని అన్నారు. ప్రైవేట్‌ యూనివర్సిటీల్లో రిజర్వేషన్లు అమలుచేసి ఫీజు రియయంబర్స్‌మెంట్‌ చెల్లించాలని డిమాండ్‌ చేశారు.  జిల్లాలో గిరజన యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని, ప్రభుత్వ కళాశాలలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని అన్నారు. సమావేశంలో ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు ఎమ్డీ.సోహెల్‌, షానబోయిన ప్రశాంత్‌, ప్రవీణ్‌, వేణు, శశి, తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
Advertisement