జింక కళేబరాన్ని పరిశీలిస్తున్నఫారెస్ట్ సెక్షన్ అధికారి
కులకచర్ల: కుక్కల దాడిలో జింక పిల్ల మృత్యువాత పడిన సంఘటన మండలంలోని విఠలాపూర్ గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం విఠాపూర్ గ్రామ శివారులో ఒగ్గు అంజయ్యకు తన పొలంలో మంగళవారం జింక కళేబరం కనిపించింది. దీంతో వెంటనే అంజయ్య అటవీశాఖ అధికారులకు సమాచారం అందించాడు. ఘటనాస్థలానికి చేరుకున్న ఫారెస్ట్ సెక్షన్ అధికారి ప్రవీణ్‌కుమార్ పరిశీలించారు. అటవీ ప్రాంతం నుంచి జింక పిల్ల నీళ్లు తాగడానికి వచ్చి ఉంటుందని, కుక్కలు దాడి చేయడంతో మృతిచెందినట్లు ఆయన తెలిపారు. పోస్టుమార్టం నిర్వహించి దహనం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఫారెస్ట్ బీట్ అధికారి సాయికుమార్ పాల్గొన్నారు.