Sep 16 2021 @ 16:35PM

దీప్‌వీర్‌.. రూ.22 కోట్ల బంగ్లా.

బాలీవుడ్‌ క్యూట్‌ జంట రణ్‌వీర్‌ సింగ్‌, దీపికా పడుకోన్‌ కొత్త బంగ్లా కొనుగోలు చేశారని, త్వరలోనే ఆ ఇంట్లోకి అడుగుపెట్టబోతున్నారని బాలీవుడ్‌ కోడై కూస్తోంది. అయితే ఇప్పడు ఆ ఇంటి ధర బీటౌన్‌లో హాట్‌ టాపిక్‌గా మారింది. దీప్‌వీర్‌ల పెళ్లి అయినప్పటి నుంచి ప్రభాదేవి అనే ప్రాంతంలో 26వ అంతస్తులో నివశిస్తున్నారు. అయితే తాజాగా ఆలీబాగ్‌ ప్రాంతంలోని కిహిమా బీచ్‌కి దగ్గర్లో ఉన్న ఓ విశాలమైన భవనంపై మనసు పారేసుకున్నారట ఈ జంట. 2.25 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన ఈ ఇంట్లో 5 బెడ్‌ రూములు, కిచెన్‌, విశాలమైన హాల్‌తో సర్వాంగ సుందరంగా అలకరించబడి ఉందని తెలిసింది. ఆ బంగ్లా ఖరీదు రూ. 22 కోట్లని బాలీవుడ్‌ మీడియా చెబుతోంది. రిజిస్ట్రేషన్ టికెట్‌ కోసమే దాదాపు రూ. 1.32 కోట్లు చెల్లించారని వినికిడి. 


Bollywoodమరిన్ని...